Amala Paul New Movie launch event.
#AmalaPaul
#tammareddybharadwaja
#aditharun
#newmovieopening
#tollywood
#movienews

అమలాపాల్ కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరుణ్‌అదిత్ హీరోగా నటిస్తున్నారు. అనూప్ పనికర్ దర్శకుడు. జె. ఫణీంద్రకుమార్, ప్రభు వెంకటాచలం నిర్మాతలు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకుడు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.రామ్మోహన్‌రావు క్లాప్‌నివ్వగా, దర్శకుడు రమేష్‌వర్మ కెమెరా స్విఛాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫోరెన్సిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏమిటో ఈ సినిమాలో చూపించబోతున్నాం. అమలాపాల్ మరోమారు వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనుంది అన్నారు.